నడుం చుట్టు కొలత పెరుగుతోందా?

10-08-2017: కొంత మంది అన్ని రకాల ఆరోగ్య నియమాలను పాటించినా, వారిలో నడుం చుట్టుకొలత రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. ఈ సమస్య కారణం నిద్రలేమి కావచ్చు అంటున్నారు పరిశోధకులు. నిద్రలేమి కారణంగా నడుం చుట్టు కొలత మూడుసెంటిమీటర్లు పెరుగుతుందన్న విషయం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. సుమారు 1700 మంది మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వీరి ఆహారపు అలవాట్లు, రక్తపోటు, బరువు, నిద్రపోయే సమయాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో సగం మంది అంటే దాదాపు తొమ్మిందల మంది రాత్రి సమయంలో ఆరు గంటల పాటు మాత్రమే నిద్రపోయే అలవాటు ఉన్నావారు. మిగతా వారు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోతారు. కొన్ని నెలల అనంతరం వీరి బరువు,రక్తపోటు పరిశీలించగా ఆరుగంటలు నిద్రపోయే వారిలో 30 శాతం మంది నడుం చుట్టుకొలత మూడు సెంటీమీటర్లు పెరగడాన్ని గమనించారు. నిద్రలేమీ కారణంగానే వీరిలో ఈ మార్పు సంభవించిన విషయాన్ని వీరు నిర్ధారించారు. నిద్రలేమితో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో పాటు అధికబరువు కూడా తోడవుతుందని వీరు స్పష్టం చేస్తున్నారు.