ఎక్కువగా టీవీ చూస్తే నిద్రలేమి

16-08-2017: అమితంగా టీవీ చూసే యువతీ యువకుల్లో నిద్రలేమి సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు తొందరగా అలసిపోతారట. ఊరికే ఉద్రేకానికి గురవుతారట. 18 నుంచి 25 ఏళ్ల మధ్యనున్న 423 మందిని పరీక్షించగా అదే పనిగా టీవీ చూసే వారిలో నిద్రలేమి, కోపం, అలసట ఎక్కువగా కనబడిందని బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్‌ లీవెన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. నిద్రకు ముందు టీవీ చూడడం మంచిది కాదని, దాని ప్రభావం నిద్రపై పడుతుందని హెచ్చరించారు. నిద్రలేమితో ఇబ్బంది పడేవారు ధ్యానం చేయడం మంచిదన్నారు.