హెచ్‌ఐవీ రోగులు పొగతాగడం అత్యంత ప్రమాదకరం

20-09-2017: హెచ్‌ఐవీ రోగులు పొగతాగడం అత్యంత ప్రమాదకరమని, వారు ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరింత త్వరగా చనిపోయే ప్రమాదముందని మసాచుసెట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. పొగతాగే అలవాటున్న హెచ్‌ఐవీ రోగులు ఎరుడ్స్‌తో కంటే ఊపరితిత్తుల కేన్సర్‌తో చనిపోయే ప్రమాదం పది రెట్లు ఎక్కువన్నారు. స్మోకింగ్‌, హెచ్‌ఐవీ చాలా చెడ్డ కలయిక అని మసాచుసెట్స్‌ పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణ వ్యక్తులు కూడా అధికంగా పొగతాగడం వల్ల 30 శాతం ఊపిరితిత్తుల కేన్సర్‌కు గురవుతారని వెల్లడించారు.