మనతో మన మాట...ఒత్తిడి హుష్‌కాకి!

27-07-2017: మనతో మనం మాట్లాడుకుంటే పిచ్చోళ్లని అంటారు. కానీ, అలా మాట్లాడుకుంటే ఒత్తిడి దూరం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా మాట్లాడుకోవటం వల్ల మెదడుకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని అమెరికాలోని మిషిగన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. మాట్లాడుకునేకంటే ముందు, ఆ తర్వాత పరిశీలిస్తే ఒత్తిడి దూరం అయ్యిందో కాలేదో మనమే తెలుసుకోవచ్చని వివరించారు.