పేగు వ్యాధికి ప్రొటీన్‌ డైట్‌తో ఉపశమనం

06-08-2017: ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గింజలు, గుడ్లు, మాంసం, చాకోలెట్స్‌, చీజ్‌ లాంటి ఆహారం తీసుకుంటే పేగు వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. పేగులోని బ్యాక్టీరియాకు ట్రిఫ్టోఫన్‌ అనే ప్రొటీన్‌ అత్యవసరమని, ఆ ప్రొటీన్‌ వీటిల్లో ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయన్నారు. ఎలుకల కడుపులోని పేగులో సహనాన్ని పెంచే రోగనిరోధక కణాలు లాక్టోబాసిల్లస్‌ రూటరీ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయని వివరించారు.