మొటిమలకు శాశ్వత చికిత్స

రెటినోయిడ్‌ యాసిడ్‌ బేస్‌డ్‌ క్రీమ్స్‌: ఈ క్రీమ్స్‌ చర్మ గ్రంధుల్లో నూనె ఉత్పత్తి తగ్గించి, చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తాయి. మొటిమలు వచ్చే వీలున్న చర్మ తత్వం కలిగినవాళ్లు ఈ క్రీమ్‌ను రోజులో 15 నిమిషాలపాటు అప్లై చేసి మొటిమలు రాకుండా కూడా నియంత్రించుకోవచ్చు.

యాంటి బయాటిక్‌ క్రీమ్స్‌: మొటిమలు అప్పటికీ అదుపులోకి రాకపోతే యాంటి బయాటిక్‌ క్రీమ్‌ పైపూతగా అప్లై చేస్తే ఫలితం ఉంటుంది. దీంతో ఫలితం లేకపోతే ‘టెట్రాసైక్లిన్‌ యాంటి బయాటిక్‌’ నోటి మాత్రలు వాడాల్సి ఉంటుంది.

ఓరల్‌ రెటినాయిడ్స్‌: పై చికిత్సలతో కూడా మొటిమలు తగ్గకపోతే అంతిమంగా ఓరల్‌ రెటినాయిడ్స్‌ వాడాల్సి ఉంటుంది. పీసీఓడీ, థైరాయిడ్‌లాంటి సమస్యలున్నవాళ్లు తప్ప ఎవరికైనా ఈ చికిత్స చక్కటి ఫలితాన్నిస్తుంది. 

ఇంటెన్స్‌ పల్స్‌ లైట్‌ థెరపీ: ఈ చికిత్సలతో కూడా సమస్య పరిష్కారం కానప్పుడు, ఫలితం త్వరితంగా ఉండాలనుకున్నప్పుడు ‘ఐపిఎల్‌ థెరపీ’ని ఆశ్రయించవచ్చు. దీంతో మొటిమలు మటుమాయమవుతాయి. ఈ ట్రీట్మెంట్‌తో సురక్షితమైన పద్ధతిలో మొటిమల్ని తక్కువ సమయంలో నివారించవచ్చు. మొటిమల మచ్చలూ తొలగిపోతాయి.

కెమికల్‌ పీల్స్‌: వీటి వల్ల కూడా మొటిమలు అదుపులోకొస్తాయి. మచ్చలు తగ్గుతాయి. ఇందుకోసం చర్మ తత్వాన్నిబట్టి నాలుగు లేదా ఐదు సిట్టింగ్స్‌ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.