తొందరగా క్షయను గుర్తించే పేపర్‌ పరీక్ష

15-09-2017: క్షయ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి దాన్ని అడ్డుకోవచ్చు. అయితే, వ్యాధిని గుర్తించే వనరులు తక్కువగా ఉన్నపుడు, రోగ నిర్ధారణకు ఎక్కువ సమయం పట్టడం లాంటి సమస్యలు ఎదురైతే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దానికోసం రోగాన్ని తొందరగా గుర్తించే పేపర్‌ ఆధారిత పరీక్షను తైవాన్‌కు చెందిన నేషనల్‌ తైవాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో పనిచేసే ఈ పరీక్షతో గంటలోనే వ్యాధిని గుర్తించవచ్చట.