గోళ్ల గోడు!

25-06-2018:గోళ్లను గురించి కత్తిరించేటప్పుడు తప్ప పట్టించుకోం! కానీ గోళ్లు మన ఆరోగ్యానికి అద్దం లాంటివి. వాటిలో వచ్చే తేడాలు మనలో దాటిన రుగ్మతలను ప్రతిబింబిస్తాయి. కాబట్టి గోళ్లలో ఈ కింది మార్పులొస్తే వైద్యులను కలవండి!
 
తెల్ల పట్టీలు: ‘మోర్క్స్‌ నెయిల్స్‌’ అనే స్థితిలో గోళ్ల మీద అడ్డంగా రెండు తెల్లని పట్టీలు ఏర్పడతాయి. ఇవి కేన్సర్‌ చికిత్సలో ఇచ్చే కీమోథెరపీ వల్ల ఏర్పడవచ్చు, లేదా కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధుల వల్ల కూడా తలెత్తవచ్చు.
 
గోరు కిందకి వంగిపోవడం: ‘నెయిల్‌ క్లబ్బింగ్‌’ అనే ఈ స్థితిలో సాధారణంగా చివర్లో కొద్దిగా పైవైపుకి తిరగాల్సిన గోళ్లు, కింది వైపుకు వంగి ఉంటాయి. కాలేయ వ్యాధులు, హృద్రోగాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ సిండ్రోమ్‌, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు గోళ్లు ఇలా వంగిపోయే అవకాశం ఉంటుంది.
 
ఎర్ర గీతలు: ‘బ్యూస్‌ లైన్స్‌’ అనే ఈ గీతలు గోళ్లకు గాయమైనా, కీమోథెరపీ తీసుకుంటున్నా, విపరీతమైన జ్వరం వచ్చినా, మధుమేహం, పెరిఫెరల్‌ వ్యాస్క్యులర్‌ డిసీజ్‌ వచ్చినా, జింక్‌ లోపమున్నా కనిపిస్తాయి.
 
స్పూన్‌ నెయిల్స్‌: ‘కాయిలోనైఖియా’ అనే ఈ సమస్యలో గోళ్లు పలచగా, చదునుగా ఉంటాయి. కొంతమందిలో గోరు మధ్యలో లోపలికి వంగిపోయి ఉంటాయి. ఈ సమస్య విపరీతమైన ఐరన్‌ లోపం, పదేపదే పేలుడు, ట్రామాకు గురవడం వల్ల తలెత్తుతుంది.