మలబద్ధకం వదిలిద్దాం!

03-06-2019: ఒత్తిడి, ఆందోళన, ఆహారంలో పీచు లోపించడం...ఇలా మలబద్ధకానికి బోలెడు కారణాలు. ఈ సమస్యను వదిలించుకోవడం కోసం మందుల మీద ఆధారపడకుండా ఇంట్లోనే లాక్సేటివ్‌ తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే....
 
కావలసిన పదార్థాలు
ఎండు ఖర్జూరాలు - కప్పు, ఎండు ద్రాక్ష - కప్పు
నీళ్లు - 5 కప్పులు
 
తయారీ విధానం
ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్షలను సన్నగా తరగాలి.
నీళ్లను మరిగించి, తరిగిన ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు వేసి తిప్పాలి.
ద్రవం చిక్కబడేవరకూ చిన్న మంట మీద ఉడికించాలి.
చల్లార్చి సీసాలో నిల్వ చేసుకోవాలి.
పరగడుపున కానీ ఉదయం అల్పాహారంతో కానీ ఒక చెంచా కలిపి తీసుకుంటే మలబద్ధకం దరి చేరకుండా ఉంటుంది.