అల్జీమర్స్‌ను ముందే కనిపెట్టొచ్చు

07-09-2017: అల్జీమర్స్‌ను ఇరవైఏళ్ళు ముందుగానే కనిపెట్టే కంటి పరీక్ష అందుబాటులోకి రాబోతోంది. లాస్‌ఏంజిల్స్‌ నిపుణుల బృందం 16మంది రోగులపై విజయవంతంగా ఈ పరీక్షలు నిర్వహించింది. అల్జీమర్స్‌ వ్యాధిని కనిపెట్టడానికి రెటీనాయే అతి ముఖ్యమైన వనరుగా వారు పేర్కొన్నారు. పదేళ్ళ క్రితం కేవలం మరణించినవారిపైనే ఈ పరిశోధనలు చేసేవారు. ఇప్పుడు నేరుగా పిఇటి పరీక్షచేసి ఈ వ్యాధి లక్షణాలు ముందే కనిపెట్టవచ్చునని cedars-–Sinai రీసెర్చ్‌ టీం సీనియర్‌ లీడ్‌ ఆథర్‌ డాక్టర్‌ మాయా కొరొన్యో చెప్పారు. అల్జీమర్స్‌ను కనిపెట్టే స్ర్కీనింగ్‌ డెవైజ్‌గా ఈeye scan ఉపయోగపడగలదని న్యూరోసర్జరీ విభాగం రీసెర్చ్‌ అసోసియేట్‌ యోసెఫ్‌ కొరొన్యో చెప్పారు. ఈ రెటీనా పరీక్షవల్ల బ్రెయిన్‌లో అల్జీమర్స్‌కు సంబంధించిన నిర్దిష్టమైన ప్రదేశాలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ రెంటికీ కోరిలేషన్‌ ఉంటుంది. దక్షిణ కాలిఫోర్నియా కామన్వెల్త్‌ ఎస్‌ఐఆర్‌ఓ విభాగంతో కలిసి ఈ పరిశోధనల్ని ఇంకా కొనసాగిస్తారు.