ఆటిజం బాధితులను గుర్తించే కంటి పరీక్ష

26-07-2017: కనుగుడ్ల కదలికల ద్వారా ఆటిజం సంబంధిత వ్యాధులను గుర్తించే సరికొత్త వైద్య పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశా రు. మెదడులోని లోపాలను గుర్తించడం ద్వారా ఆటిజం బాధితులను గుర్తించేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. ఈ ఆవిష్కరణతో పలు నాడీ సంబంధిత వ్యాధుల నిర్ధారణకూ కళ్ల కదలికలు ఉపయోగపడతాయని యూనివర్సిటీ ఆఫ్‌ రోచెస్టర్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు తెలిపారు. మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకున్న సంబంధ బాంధవ్యాలను ఈ కదలికలే నిర్ణయిస్తాయన్నారు.