మృత్యువును దగ్గర చేసే ఒంటరితనం

17-08-2017: ఒంటరిగా ఉండడం, నలుగురితో కలవకపోవడం వంటి కారణాలు వ్యక్తులును మృత్యువుకు చేరువ చేస్తాయని అంటున్నారు అమెరికా పరిశోధకులు. రెండు దఫాలుగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాన్ని వారు గుర్తించారు. మొదటిసారి సుమారు మూడు లక్షల మంది మీద దఫాల వారీగా అధ్యయనం నిర్వహించారు. వీరిలో చాలామంది ఒంటరితనంతో బాధపడుతున్న వారే! కొన్ని నెలలు అనంతరం ఒంటరితనంతో బాధపడుతున్న వారిలో 20 శాతం మంది అకాల మృత్యువాత పడ్డారు. రెండవసారి 3.4 లక్షల మంది మీద అధ్యయనం నిర్వహించారు. రెండవసారి కూడా మొదటిసారిలాగా చాలామంది మృత్యువుకు చేరువయ్యారు. ఒంటరితనంతో బాధపడుతున్న వారిలో అధికబరువు, ఒత్తిడి, రక్తపోటు, చక్కెర తదితర ఆరోగ్య సమస్యలను వీరు గుర్తించారు. చిన్న వయస్సులోనే ఒంటరితనంతో బాధపడేవారిలో ఈ సమస్యలు కచ్చితంగా కనిపిస్తాయనీ, ఇవే వీరిని మృత్యువుకు చేరువ చేస్తాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ‍