మహిళలకే ఆస్తమా ముప్పెక్కువ!

వాషింగ్టన్‌, నవంబరు 29: పురుషులతో పోల్చితే మహిళలే ఆస్తమా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని తమ పరిశోధన ద్వారా తేలిందని అమెరికాకు చెందిన వాండెర్‌బిల్ట్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా యుక్తవయసు దాటిన పురుషులతో పోల్చితే మహిళల్లోనే ఎక్కువగా ఆస్తమాను గుర్తించామన్నారు. మెనోపాజ్‌ దశ దాటిన వయసు మహిళల్లో మాత్రం ఆస్తమా తక్కువగా ఉంటుందన్నారు. ఆస్తమా వ్యాధి కారకాలపై లైంగిక హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎలుకలపై తాము జరిపిన పరిశోధన ద్వారా గుర్తించామని చెప్పారు.