వృద్ధుల్లో ‘వెన్ను’ భారం

ఆంధ్రజ్యోతి(30-01-2017) 

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వృద్ధుల్లో వెన్నుపూస సమస్య పెరుగుతున్నట్టు వైద్యులు జరిపిన అధ్యయనంలో తేలింది. 65 ఏళ్లు పైబడిన వారిలో 60 శాతం మంది వెన్నుపూస ఇబ్బందుల వల్ల వంగిపోయి నడవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, కాళ్లు తిమ్మిరిగా ఉండడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వృద్ధుల సమస్యలపై ప్రముఖ వెన్నుపూస వైద్యుడు డాక్టర్‌ జె. నరే్‌షబాబు బృందం పరిశోధన చేసింది. దీనికి గాను ఈ బృందానికి అసోసియేషన ఆఫ్‌ స్పైన సర్జన్స ఆఫ్‌ ఇండియా (ఏఎ్‌సఎ్‌సఐ) సంస్థ జాతీయ అవార్డును ఇచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లోని హెచఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ఏఎ్‌సఎ్‌సఐ అధ్యక్షుడు డాక్టర్‌ రామ్‌ చద్దా చేతుల మీదుగా డాక్టర్‌ నరే్‌షబాబు అవార్డును అందుకున్నారు. ఈ బృందం లో వైద్యులు రాజు, అరుణ్‌కుమార్‌ ఉన్నారు.