కృత్రిమ తీపితో ఊబకాయం, హృద్రోగ ముప్పు

18-2-2017: తీపినిచ్చే కృత్రిమ పదార్థాలతో ఊబకాయం, హృద్రోగముప్పు, బీపీ, మధుమేహం, బరువు పెరగడం వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పోషకాలు లేని ఆ పదార్థాలు జీవక్రియ, కడుపులోని పేగు బ్యాక్టీరియా, ఆకలిపై చెడు ప్రభావం చూపుతాయని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మనిటోబా పరిశోధకులు తెలిపారు. దాదాపు 10 ఏళ్ల పాటు 4లక్షల మందిని పరీక్షించగా కృత్రిమ తీపి పదార్థాలతో రోగాలు తొందరగా వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు.