గర్భిణులు అన్నం తింటే పిల్లల్లో ఉబకాయం!

9-6-2017: గర్భంతో ఉన్నపుడు మహిళలు అన్నం లాంటి శుద్ధి చేసిన ధాన్యాలు ఎక్కువగా తింటే పుట్టే పిల్లల్లో ఊబకాయ సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏడేళ్ల వయసు వచ్చే సరికి పిల్లల్లో రక్తపోటు, గమధుమేహం(టైప్‌-2) వచ్చే అవకాశం ఉందని అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 918 మంది గర్భిణులను పరీక్షించగా ఎక్కువగా శుద్ధి చేసిన ధాన్యాలు(156 గ్రాములకు మించి) తీసుకున్న వారి పిల్లల్లో ఉబకాయ సమస్యలు తలెత్తినట్లు రుజువైందన్నారు.