టీనేజ్‌లో ఊబకాయం.. పెద్దయ్యాక పేగు కేన్సర్

25-7-2017: కౌమార ప్రాయంలో అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారికి పెద్దయ్యాక పేగు కేన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. అధిక బరువుతో ఈ ముప్పు 53 శాతం పెరగనుండగా.. ఊబకాయంతో పేగు కేన్సర్‌ ముప్పు 54 శాతం పెరుగుతుందని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు. పది లక్షల మంది పురుషులు, ఏడు లక్షల మంది మహిళలపై పదేళ్లకు పైగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తేలిందని వర్సిటీ ప్రొఫెసర్‌ జోహర్‌ లెవీ తెలిపారు.