పిల్లల్లో ఒబేసిటీ!

17-06-2017:ఊబకాయంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో ఇండియా రెండో స్థానంలో ఉంది. కోటి యాభై లక్షల చిన్నారులతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, కోటి నలభైనాలుగు లక్షల చిన్నారులతో ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది చిన్నారులు, పెద్దలు స్థూలకాయం మూలంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుండెజబ్బులు, డయాబెటిస్‌, కేన్సర్‌, ఇతర ప్రమాదకరమైన జబ్బులు ఊబకాయం వల్లే వస్తున్నాయి. వీటివల్ల చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉందని పరిశోధకులు అంటున్నారు. గత ఏడాది దాదాపు 40 లక్షల మరణాలు అధిక బరువు కారణంగానే జరిగాయు. అందులో 40 శాతం మంది బాడీ మా్‌స ఇండెక్స్‌(బిఎమ్‌ఐ) ‘ఒబేసిటీ’ని సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒబేసిటీతో బాధపడుతున్న చిన్నారులు అమెరికాలో 13 శాతం ఉంటే, ఈజిప్టులో అధికంగా 35 శాతంగా ఉన్నారు. బంగ్లాదేశ్‌, వియత్నాంలో అతి తక్కువగా 1 శాతం ఉన్నారు.