లావుకు సెలవు చెప్పాలంటే...

ఆంధ్రజ్యోతి, 13-02-2018: లావుగా ఉన్న అమ్మాయిలు సన్నబడడానికి పడని కష్టం ఉండదు. సన్నగా...నాజూగ్గా...నేవళీకంగా, అందంగా ఎలా కనిపించాలని ఇరవైనాలుగు గంటలూ ఆలోచిస్తుంటారు. అయితే ఇది ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు. దీనికి పద్ధతైన డైట్‌ అలవాటు చేసుకోవాలి. అంతేనా...?నిత్యం వ్యాయామాలు కూడా చేయాలి. ఇందుకు కొన్ని చిట్కాలు...

 జీవనశైలిలో శాశ్వత మార్పులు రావాలి.
 తినే ఆహారం విషయంలో మార్పులు ఉండాలి.
 నిత్యం వ్యాయామాలు చేయాలి.
 మంచి నిద్ర పోవాలి.
 పీచుపదార్థాలు ఉండే కాయగూరలను తినాలి.
 నీళ్లు బాగా తాగాలి.
 లిఫ్ట్‌ ఉపయోగించకుండా మెట్లు ఎక్కాలి.
 ఎంట్రెన్స్‌కు దూరంగా కారు పార్కు చేసుకుంటే కనీసం కొంతదూరమైనా నడవొచ్చు.
 సరిగా నిద్రపోకపోతే ఆకలి మందగిస్తుంది.
 తక్కువ నిద్ర పోతే ఎక్కువ బరువు పెరుగుతారు.
 రోజూ కనీసం 45 నిమిషాలు నడవాలి.
 టైముకు ఆహారం తీసుకోవాలి.
 క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని ఫాలో అవాలి.
 ఇన్ని చేసినా శరీర బరువు తగ్గలేదనుకోండి వైద్యుని సంప్రదించాలి.
 లావుగా ఉన్నామనుకోగానే చాలామంది సర్జరీకి వెళిపోతుంటారు. కానీ ఇది సరైన నిర్ణయం కాదు.
 పూర్తి స్థాయి వైద్యపరీక్షల అనంతరం వైద్యుల సూచనల ప్రకారం నడుచుకోవాలి.