ఈ 7 రోజుల డైట్ ప్లాన్‌తో మాలిన్యాలు, బరువు హుష్ కాకి...

13-05-2018: సహజ పద్ధతిలో శరీరంలోని మాలిన్యాలు తొలగించుకోవడంతోపాటు బరువు తగ్గే విధానాన్ని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా బరువు తగ్గడంతోపాటు బ్లడ్‌షుగర్, బ్లడ్‌ప్రజర్ అదుపులోకి వస్తుంది. ఈ ప్లాన్‌ను 3 రోజులు, 7 రోజులు లేదా 10 రోజులు ఫాలో చేయవచ్చు. పైగా ఈ విధానంలో ఆహారాన్ని పూర్తిగా విడిచిపెట్టనవసరం లేదు. ఈ పద్దతిని పాటించడం ద్వారా 10 రోజుల్లో 2 నుంచి 3 కిలోల బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ డైట్ ప్లాన్‌లో ఉదయం తీసుకునే డ్రింక్ మొదలు కొని రాత్రి డిన్నర్ వరకూ ఏమేమి తీసుకోవాలో వారు వివరించారు.

ఉదయం: డిటాక్స్ డ్రింక్
ముందు రోజు రాత్రి ఒక లీటరు నీటిలో కీరా ముక్కలు, నిమ్మరసం, 8 నుంచి 10 పుదీనా ఆకులు, కొద్దిగా అల్లం వేసి ఉంచాలి. ఉదయాన్నే ఆ నీటిని కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఈ డ్రింక్ శరీరంలోని మాలిన్యాలు తొలగించడంతో పాటు ఫ్యాట్‌ను కరిగిస్తుంది.
బ్రేక్‌ఫాస్ట్: కొత్తమీర, పాలకూర, నిమ్మరసం, పియర్, ఆపిల్ ముక్కలను బ్లెండ్ చేసుకుని తాగండి. ఈ డ్రింక్‌లో పొటాషియం పాళ్లు అధికంగా ఉంటాయి. దీంతో తరచూ ఆకలి వేయదు.
లంచ్‌కి ముందు:
క్యారెట్ ముక్కలు, పుదీనా, కీరా, కొత్తిమీర ఒక బౌల్‌లోకి తీసుకుని తినండి.
లంచ్‌లో:
ఒక పెద్ద బౌల్‌లో వివిధ రకాల మొలకెత్తిన గింజలు తీసుకుని దానిలో ఒక చెమ్చా ఆలివ్ ఆయిల్ వేసి, దానిలో కొద్దిగా ఆపిల్ ముక్కలు, కాస్త వెనిగర్ వేసి తినండి. దీనితోపాటు ఉడికించిన బంగాళ దుంపలు, నిమ్మరసం, కాస్త మిరియాలు, కాస్త వెనిగర్ వేసి దానిని తినండి.
సాయంత్రం: నానబెట్టిన 3-4 బాదం గింజలు, గుమ్మడి గింజలు తినండి.
డిన్నర్: బ్రౌన్ రైస్‌లో ఉల్లిపాయ, మష్రూమ్, మొలకెత్తిన గింజలు, వెల్లల్లి, ఆలివ్ ఆయిల్ మొదలైనవి ఉడికించి చల్లార్చి తినండి. దీనితోపాటు స్టమ్‌డ్ ఫిష్‌ను స్టీమ్‌డ్ ఆలూ. కూరతో పాటు తీసుకోండి.