బరువును తగ్గించే ఉల్లికాడలు!

21-06-2018: ఉల్లి కాడలను ఆహారపదార్ధాల తయారీలో ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడరు. దీన్ని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం వలన పలుఆరోగ్యసమస్యలు తలెత్తుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది తప్పు అంటున్నారు నిపుణులు. వీటిని ఆహారపదార్థాల్లో ఉపయోగించడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని వారు చెబుతున్నారు వీటికి చెడు కొలస్ట్రాల్‌నూ, కాలేయం చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించే గుణముంది.. అంతే కాకుండా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఇది దివ్యమైన ఔషధం. కెలొరీలు కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్య తలెత్తదు.