ఏడు రోజుల్లో బరువు తగ్గేందుకు ఏం చేయాలంటే...

23-11-2017: డైట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న ఈ సలహాలు పాటిస్తే కేవలం 7 రోజుల్లో 3 కిలోల వరకూ బరువు తగ్గేందుకు అవకాశముంది. రోజులో 6 సార్లు కొద్ది కొద్దిగా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా 7 రోజుల్లో 3 కిలోల బరువు తగ్గుతారని నిపుణులు గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ విధానాన్ని అనుసరించడం వలన బాడీ.. ఫ్యాట్ బర్నింగ్ మోడ్‌లోకి వెళుతుంది. ఆహార నిపుణులు అందించిన ఏడు రోజుల ఫుడ్‌ప్లాన్‌ను పాటిస్తూ తగిన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ను టెరీ ఎన్ర్, అతని వ్యక్తిగత ట్రైనర్లు సంయుక్తంగా రూపొందించారు. రోజులో ఆరుసార్లు కొద్ది మోతాదులో ఆహారం తీసుకోవడం వలన జీర్ణాశయం చక్కగా పనిచేస్తుంది. అధికమోతాదులో ఆహారం తీసుకున్నప్పుడు ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ ఆరుసార్లు ఆహారం తీసుకునే విధానం వలన శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.