అవిసెలతో బరువు తగ్గొచ్చు

26-06-2018: ఊబకాయం కొందరికి జన్యుపరంగా వస్తే మరికొంత మందికి వారి జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. తినే ఆహారంపై ముందునుంచే శ్రద్ధపెడితే దీనిని నివారించవచ్చు. ఇప్పటి వరకు ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి శారీరక వ్యాయామం చేయడం, డైటింగ్‌ చేయడం లాంటి వాటిని చూశాం. అయితే శరీర బరువు తగ్గడానికి అవిసెలు కూడా చాలా ఉపయోగపడతాయని ఆహార నిపుణులు చెప్తున్నారు.
 
అవిసె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వేడిని పుట్టిస్తాయి. ఫలితంగా శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీంతో శరీర బరువు కూడా తగ్గుతుంది.
వీటిల్లో ప్రోటీన్‌ అధికంగా ఉంటుంది. ప్రోటీన్‌లు శరీర బరువు తగ్గుదలలో విశేషంగా తోడ్పడుతాయి.
అవిసెల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. దాంతో తినే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
వీటిల్లో ఒమెగా3 ఫాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవిసెగింజలను రోజువారీ ఆహారంలో తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
అవిసె గింజల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు మోకాళ్ల నొప్పులు రాకుండా చేస్తాయి.
అవిసెల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల నేరుగా తింటే సరిగ్గా జీర్ణం కాదు.అందుకే సూప్‌, సలాడ్‌ల రూపంలో భోజనంతో పాటుగా వీటిని తీసుకోవాలి.