ఊబకాయానికి ఇదే కారణమా?

08-11-2018: చిన్నతనంలోనే ఊబకాయానికి రకరకాల సమస్యలు కారణాలు కావచ్చన్న సంగతి తెలిసిందే! అయితే హార్మోన్లలో హెచ్చుతగ్గులు కూడా టీనేజ్‌లో ఊబకాయానికి కారణమవుతుందన్న సంగతి ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ స్థితిని స్పెక్సిన్‌ అంటారు. ఈ స్పెక్సిన్‌ చిన్న వయసులోనే ఊబకాయానికి కారణమవుతోందని తేలింది. ఈ స్టడీలో భాగంగా లావుగా ఉన్న 51 మందిలో, అలాగే నార్మల్‌ వెయిట్‌ ఉన్న 12-18 వయసులోని వారిలో స్పెక్సిన్‌ ప్రమాణాలను పరిశీలించారు. 2008 నుంచి -2010 వరకూ చేసిన అధ్యయనంలో పాల్గొన్నవారి రక్తనమూనాలను పరీక్షించారు. వారిలోని స్పెక్సిన్‌ ప్రమాణం బట్టి టీనేజర్స్‌ను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఎక్కువ హార్మోన్లు ఉన్న వారిలో కన్నా స్పెక్సిన్‌ ప్రమాణాలు బాగా తక్కువ ఉన్న వారిలో భారీకాయం వచ్చే అవకాశాలు ఐదు రెట్లు ఎక్కువ ఉందని తేలింది. అయితే ఈ అంశంపై మరింత అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అధ్యయనకారులు భావిస్తున్నారు.