ఏడో రుచితో ఊబకాయం ముప్పు

28-10-2017: షడ్రుచులు.. అంటే ఆరు రుచులు. ఈ ఆరు రుచులనే మన నాలుక గుర్తించగలదని ఇంతవరకు భావిస్తున్నాం. కానీ కొంతమంది ఏడో రుచిని కూడా గుర్తించగలరని అస్ట్రేలియాకు చెందిన డీకిన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పిండి పదార్థాలను కూడా కొంతమంది రుచి చూడగలరని 34 మందిపై అధ్యయనం చేసి గుర్తించామన్నారు. ఈ కారణంగానే వీరికి స్థూలకాయం వంటి సమస్యలు ఎదురవుతాయని అన్నారు.