పొట్ట చదునుగా!

13-03-2018: పొట్ట భాగంలోని కొవ్వు కరిగి చదునుగా మారాలంటే క్రాస్‌ క్రంచెస్‌ చేయాలి. ఇందుకోసం.....

 
వెల్లకిలా పడుకుని, రెండు చేతులు మడిచి తల వెనక ఉంచుకోవాలి.
కాళ్లను మడిచి పాదాలను నేల మీద ఆనించాలి.
ఇప్పుడు కుడి మోచేతిని పైకి లేపుతూ ఏటవాలుగా వంగి మోచేతిని ఎడమ మోకాలికి తాకించాలి.
నడుము పై భాగాన్ని లేపేటప్పుడ మడిచిన కాలునూ పైకి లేపి మోచేతికి తాకించాలి.
కాళ్లను మడవకుండా కూడా ఈ వ్యాయామం చేయవచ్చు.
ఇలా రెండు మోకాళ్లను కదిలిస్తూ 25 సార్లు క్రంచెస్‌ చేయాలి.
ఈ వ్యాయామంతో పై పొట్ట, కింది పొట్ట, పక్కటెముకల దగ్గరి కండరాలు బలపడతాయి. నడుము కూడా సన్నబడుతుంది. చేతుల్లోని కండరాలు కూడా టోన్‌ అవుతాయి. తొడల్లోని కొవ్వూ కరుగుతుంది.