పొట్ట... రోగాల పుట్ట

పొంచి ఉన్న ఊబకాయం 

పలు రోగాలకు ఇదే కారణం
చిన్నారుల్లోనూ ఆందోళన కలిగిస్తున్న ఓబేసిటి
ఉమ్మడి జిల్లా జనాభాలో 50శాతం మంది బాధితులే..

హైదరాబాద్, 27-02-2018: ఊబకాయం.. నేటి సమాజంలో ప్రమాదకరంగా మారుతోంది. అధిక పొట్ట రోగాల పుట్ట.. అన్న నానుడి అక్షర సత్యమవుతోంది. ఆహార అలవాట్లు మారు తుండడంతో ఊబకాయం(ఓబేసిటి) ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తోంది. కనీస శారీరక వ్యాయామం లేకపోవడం.. జంక్‌ఫుడ్‌ మరో ప్రధాన కారణాలుగా చెబుతున్నారు వైద్యులు. పెద్దవారితోపాటు చిన్నారులు ఊబకాయం బారిన పడు తుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఊబకాయం తగ్గిం చేందుకు బేరియాటిక్‌ శస్త్రచికిత్స విధానం నూతనంగా అందుబాటులోకి వచ్చింది. ఊబకాయంపై ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో చైనా తర్వాత మనదేశం ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఊబకా యంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిస్తుంది. 

జనాభాలో సగ భాగం ఊబకాయులే..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనాభా సగభాగం ఊబకా యలే. అందులో ఉన్నతవర్గాలకు చెందిన మహిళలు 50శాతం ఉండగా, అన్నివర్గాల పురుషుల్లో 30శాతం ఉన్నారు. ఇక చిన్న పిల్లలు కూడా 20శాతం ఈ ఊబకాయం బారిన పడుతు న్నారు. నెయ్యి, డాల్డా, నూనే కలిసిన ఆహార పదార్థాలతోపాటు జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినడంతో రక్తంలో కొవ్వు శాతం పెరుగు తుంది. దీని కారణంగా ఊబకాయ బాధితుల్లో 40శాతం మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వీరిని పట్టి పీడిస్తున్నారు.
 
చిన్నారులను పీడిస్తోంది 
ఇటీవల పలు స్వచ్ఛంద సంస్థ 16ఏళ్ల వయసున్న విద్యార్థు లపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 850మంది పరిశీ లించగా, అందులో అంటే 25శాతం పిల్లలు ఊబకాయ బాధి తులు ఉన్నట్లు తేలింది. చదువుల్లో పోటీతత్వం పెరగడం. వ్యాయా మంపై శ్రద్ధ పెట్టకపోవడంతో బడీడు పిల్లలు ఈ వ్యాధికి గురవుతున్నారు. ప్రస్తుతం ఖరీదైన ల్యాపోసెక్షన్‌ చికిత్స అందు బాటులో ఉన్న దానివల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 
 
అందుబాటులో బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స
ఊబకాయాన్ని నివారించేందుకు ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో బేరియాట్రిక్‌ శస్త్ర చికిత్స ఒక్కటి. బరువు అధికంగా ఉన్నవారు ఈ శస్త్రచికిత్స చేయించు కుంటే లావు తగ్గడమే కాకుండా 70శాతం మధుమేహం, బిపి, మోకాళ్ల నొప్పులు, నరాలు ఉబ్బడం, రాత్రి గురక పెట్టడం వంటి వ్యాధులతో పాటు గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంత వ్యా ధుల నుంచి కూడా 50శాతం ఉపశమనం పొందవచ్చు. 2009లో దేశంలో అందుబాటులోకి వచ్చిన ఈ బేరియాట్రిక్‌ శస్త్ర చికిత్స ప్రస్తుతం హైదరా బాద్‌లోని ప్రముఖ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది.   
        
ప్రధాన కారణాలు
ఎలాంటి శారీరక వ్యాయామం లేకపోవడం
హార్మోన్లలో అసమానతల వల్ల(ఐపోథైరాయిడిజిం)
ఒత్తిడి.. ఆందోళనలు
అధికంగా చిరుతిండ్లు, ధూమపానం 
 
అప్రమత్తత అవసరం 
ఊబకాయం తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. ఈ వ్యాధిపై జాగ్ర త్తలు తీసుకుంటే భవిష్యత్‌లో ఉపశ మనం పొందవచ్చు. చిన్నా రుల్లో 25శాతం ఊబకాయం ఉన్నట్లు ఇటీవల చేపట్టిన పలు సర్వేలో వెల్లడైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పెద్దలతోపాటు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలి.
- నాగేశ్‌ వైద్యులు, ఈఎస్‌ఐ, బీబీనగర్‌ 
 
అందుబాటులో బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స 
ఊబకాయం వ్యాధిగ్రస్తులకు తాజా ఆధునిక శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బేరి యాట్రిక్‌ శస్త్రచికిత్స చేయించు కుంటే భవిష్యత్‌లో ఊబకాయం సమస్య ఉండదు. ఇప్పటికే హైద రాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో బేరియాట్రిక్‌ శస్త్ర చికిత్సలు చేశాం. ప్రస్తుతం వారు ఎంతో ఉపశమనం పొందుతున్నారు. 
- డాక్టర్‌ మహేశ్వర్‌రెడ్డి, నిమ్స్‌ సూపరిండెంట్‌ బీబీనగర్‌