అల్లం రసంతో ఒబేసిటీ సమస్య దూరం

26-10-2017: ఔషధ విలువలున్న అల్లం రసం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఉదయాన్నే కాని లేదా రాత్రి భోజనం ముందు గ్లాసు అల్లం రసం తాగితే అధిక బరువు సమస్య దూరమవుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఒబేసిటీ సమస్య పరిష్కారంతోపాటు అల్లం రసం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని వెల్లడైంది.ఇది కేన్సర్ ను దూరం చేసి అధిక రక్తపోటు సమస్య రాకుండా నివారిస్తుందని శాస్త్రవేత్తులు చెప్పారు. రక్తం గడ్డ కట్టకుండా నిరోధించి గుండెపోటు సమస్య రాకుండా ఈ రసం ఉపకరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం... ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న అల్లం రసాన్ని మనమూ తాగుదాం.