బరువు తగ్గించే డ్రింక్‌

29-05-2018: శరీర బరువు తగ్గాలంటే మెటబాలిజంను పెంచే ఆహారం తీసుకోవాలి. ఇదిగో ఈ హెల్తీ డ్రింక్‌ పరగడుపునే తాగితే క్రమేపీ బరువు తగ్గుతారు.

 
కావలసిన పదార్థాలు
అరటి పండు - 1, ఆకుపచ్చని కూరగాయలు - గుప్పెడు
ప్రొటీన్‌ పౌడరు - 2 టీస్పూన్లు
కొబ్బరి పాలు - అర కప్పు, ఐసు ముక్కలు - 2
 
తయారీ విధానం
 అరటిపండు, కూరగాయ ముక్కలు, ప్రొటీన్‌ పౌడర్‌ మిక్సీలో వేసి తిప్పాలి.
 తర్వాత కొబ్బరి పాలు, ప్రొటీన్‌ పౌడరు వేసి ఇంకోసారి తిప్పాలి.
 గ్లాసులో నింపి ఐసు ముక్కలు వేసుకుని తాగాలి.