బరువు తగ్గేదెలా?

17-11-2017: నా వయసు 39. నేను 90 కేజీల బరువు ఉన్నాను. బరువు తగ్గటానికి ఆరోగ్యకరమైన డైట్‌ చెప్పండి.

సునీత, జనగాం
 
బరువు తగ్గడానికి మీరు ఈ విధంగా చెయ్యాలి
మొదట మీ ఎత్తు సెంటీమీటర్లలో కొలిచి, అందులో నుండి 100 తీసివేస్తే మీరు ఉండవలసిన బరువు వస్తుంది. ఉదా: మీ ఏత్తు 170 సెంమీలు అనుకుంటే 170-100=70. అంటే మీరు ఉండాల్సిన బరువు 70 కేజీలు. ఇప్పుడు మీ టార్గెట్‌ రెడీ.
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్‌తో పాటు కనీసం 10 ముక్కలు పచ్చి కాయగూర ముక్కలు ఉండాలి. ఒక కీరా / ఒక క్యారెట్‌, రెండు ఫ్రూట్స్‌ ఉండాలి. మొదట పచ్చికాయగూర ముక్కలు తినాలి, తరువాతే మిగిలిన ఆహరం తినాలి. ఇలా చెయ్యడం వల్ల మొత్తం ఆహరంలో కొంత భాగం తినడం తగ్గుతుంది.
బ్రేక్‌ఫాస్ట్‌లో, లంచ్‌లో, డిన్నర్‌లో తప్పని సరిగా ప్రోటీన్‌ ఉండేట్టు చూసుకోవాలి. అల్పాహారంలో గుడ్డు.. లంచ్‌లో పప్పు.. డిన్నర్‌లో పన్నీర్‌ ఉండేట్టు చూసుకోవాలి.
మొలకెత్తిన గింజలు/ వేరుసెనగ గింజలు/పళ్ళు స్నాక్స్‌ ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు తీసుకోవచ్చు.
వారానికి ఒకసారి కేవలం పళ్ళు కూరగాయలు తీసుకొని ఉపవాసం ఉండాలి.
సమయానికి ఆహరం తీసుకోవడం 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి
రోజుకి 30 నిమిషాలు తప్పకుండా వ్యాయామం చెయ్యాలి.
బరువు తగ్గాలంటే ఇలాంటి డైట్‌ను ఫాలో కావచ్చు.
ఉదయం 7గంటలకు: 5 బాదం పలుకులు, 5 ఖర్జూరాలు
ఉదయం 9: సలాడ్‌, ఒక ఇడ్లి, 1 గుడ్డు, ఆరెంజ్‌ జ్యూస్‌ 1 కప్‌
11 గంటలకు : ఫ్రూట్‌/టీ
మధ్యాహ్నం 1 : సలాడ్‌, 1 కప్‌ రైస్‌, పప్పు ఆకుకూర, గ్లాస్‌ మజ్జిగ
సాయంత్రం 4 గంటలకు: గుప్పెడు వేరుసెనగ గుళ్ళు, టీ/ఫ్రూట్‌
7 గంటలకు : సలాడ్‌, ఒక చపాతీ, చికెన్‌/పన్నీర్‌ కర్రీ, మజ్జిగ
రాత్రి 10 గంటలకు : అరకప్పు పాలు, 2 బాదం పలుకులు.
 
డాక్టర్‌ జానకిన్యూట్రిషనిస్ట్‌
drjanakibadugu@gmail.com
Ads by ZINC