ఊబకాయానికి కొత్త మందు

29-07-2017: ఊబకాయాన్ని వదిలించుకునే ప్రక్రియలో మొదటిదైన ఆకలిని నియంత్రించేందుకు పరిశోధకులు కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఆకలి సంకేతాలను పంపే మెదడులోని రెం డు రకాల న్యూరాన్లను గుర్తించారు. వీటిని అదుపు చేయగలిగితే ఆకలిని నియంత్రించి శరీరంపై పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది. లెప్టిన్‌ నిరోధకత వల్ల ఊబకాయం వస్తుందని గతంలోనే వెల్లడైంది. అయితే, ఈ హార్మోన్‌ సమస్యను అధిగమించేందుకు ఇప్పటి వరకు సరైన మార్గం దొరకలేదని శాస్త్రవేత్తలు వివరించారు.