బరువు తగ్గాలంటే...

02-11-2018: గత మూడు నెలల్లో నేను ఎనిమిది కిలోల బరువు తగ్గాను. కానీ ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఒక్క గ్రాము బరువు కూడా తగ్గడం లేదు. డైట్‌ చాలా స్ట్రిక్ట్‌గా చేస్తున్నా కూడా. ఇక నా పని ఇంతేనా? కనీసం ఇంకో ఐదు కిలోలు తగ్గాలని ఉంది. ఏదో ఒక మార్గం చెప్పండి.

-పార్వతి, తిరుపతి
మీలాగే చాలామంది అడుగుతున్నారు. బరువు తగ్గాలని ప్రయత్నం చేసే వారందరూ తప్పనిసరిగా పాటించాల్సినవి ఇవి..
వారానికో లేదా 15 రోజులకో డైట్‌లో మార్పు తీసుకురావాలి.
ప్రతీ నెల లేక 15 రోజులకు ఒకసారి లిక్విడ్‌ డైట్‌ ఫాలో అవ్వాలి. అవసరాన్ని బట్టి.
పోషకాహార నిపుణులు చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. చెప్పినదానికన్నా అతి తక్కువగా (త్వరగా బరువు తగ్గాలనే ఆశతో) లేదా అతిగా తీసుకోకూడదు.
తగ్గిన బరువును కనీసం 18 నెలలు మెయింటెయిన్‌ చెయ్యగలిగితే, తగ్గిన బరువు పెరగరు.
ఇప్పుడిక మీ బరువు తగ్గించడానికి ఒక్కరోజు ఈ లిక్విడ్‌ డైట్‌ ఫాలో అవ్వండి...
తేనె, లెమన్‌ వాటర్‌
కొబ్బరిబోండాం నీళ్లు
ఒక టీ స్పూను సబ్జాగింజలు కలుపుకుని మజ్జిగ
ఆరెంజ్‌ జ్యూస్‌
రాగి జావ, ఉప్పు, మజ్జిగ
ఓట్స్‌ జావ
పాలకూర సూప్‌
ఈ విధంగా ఒక్కరోజు చేస్తే మీ బరువు కొంత తగ్గుతుంది. అవసరాన్ని బట్టి వారానికి ఒక్కరోజు ఇలా చేయండి.
 
 
డాక్టర్‌ బి. జానకి
న్యూట్రిషనిస్ట్‌
drjanakibadugu@gmail.com