పొత్తి కడుపు చదునుగా!

26-02-2018:పొత్తి కడుపు దగ్గర పేరుకునే కొవ్వును కరిగించాలంటే క్రంచెస్‌ చేయక తప్పదు. వీటిలోనూ కొద్దిగా కష్టమనిపించే లెగ్‌ రైజ్‌ క్రంచెస్‌ చేస్తే, తక్కువ సమయంలోనే ఎక్కువ కొవ్వును కరిగించవచ్చు. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే?

నేల మీద కాళ్లు చాపి కూర్చోవాలి.
చేతులతో రెండు కిలోల డంబెల్‌ తీసుకుకోవాలి.
ఇప్పుడు కాళ్లను రెండు అడుగల ఎత్తుకు లేపి గాల్లో ఉంచి, చేతులతో డంబెల్‌ పట్టుకుని, కుడి వైపుకు, ఎడమ వైపుకు తిరగాలి.
ఇలా 20 రిపీట్స్‌, 3 సెట్స్‌ చేయాలి.