పొట్ట తగ్గేందుకు బ్రహ్మాండమైన ఉపాయం..

ఆంధ్రజ్యోతి, 02-12-2017: నిమ్మ టీ గురించి అందరికీ తెలుసు. కానీ అది అందించే ప్రయోజనాలు కొద్దిమందికే తెలుసు. నిమ్మ తేనీరు తాగడం వలన ఉదర భాగంలోని కొవ్వు కరగిపోతుంది. నిమ్మటీ వలన కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. నిమ్మకాయలోని విటమిస్ సీ శరీరంలోని మాలిన్యాలను బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తుంది. నిమ్మ టీ తీవ్రమైన జలుబు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. రోజుకు రెండు నుంచి మూడు సార్లు నిమ్మ టీని తాగడం వలన గొంతు సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే శరీరంలోని రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. మెదుడు చురుకుగా పనిచేసేందుకు, మానసిక వత్తిడి నివారణకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తలనొప్పి, నీరసం మొదలైనవి దూరమవుతాయి. నిమ్మటీ.. మధుమేహ రోగులకు చక్కటి ప్రయోజనాన్ని అందిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ మోతాదును పెంచి, షుగర్‌ను అదుపులో ఉంచుతుంది.