‘ఫ్యాట్‌’ మ్యాటర్‌!

13-09-2017: పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరగడం చాలా కష్టం. ఒకే ప్రదేశంలో కేంద్రీకృతమైన కొవ్వును కరిగించడం సవాలుతో కూడిన పని. ఈ కొవ్వును ఆరోగ్యకర రీతిలో తగ్గించుకుంటే మంచిది. పొట్ట తగ్గడానికి బాగా నడవాలి...తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవాలి.

కంప్యూటర్‌, మొబైల్‌ లేదా టివి చూస్తూ చాలామంది ఫుడ్‌ తింటుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఆహారం తీసుకునేటప్పుడు వేరే ఏ పనులూ చేయకుండా ఏకాగ్రతతో తినాలి. ఎందుకంటే గతంలో చేసిన స్టడీల్లో కూడా టివి చూస్తూ తినడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ పరిమాణంలో తింటామని వెల్లడైంది.

అవకెడో, మొలకులు, నల్ల నేరేడుపళ్లు, అవిసలు వంటి వాటిల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తొందరగా జీర ్ణమవుతాయి. దీంతో పొట్ట తగ్గుతుంది.

ఒత్తిడి వల్ల అడ్రినల్‌ గ్లాండ్స్‌ కోర్టిసాల్‌ను అధికస్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కూడా పొట్టలో కొవ్వు బాగా ఎక్కువవుతుంది.

ఆడవాళ్లల్లో ఎక్కువగా పొట్టలో కొవ్వు పేరుకుపోవడానికి కారణం వాళ్ల నడుము మగవాళ్ల కన్నా పెద్దదిగా ఉండడం. దీంతో సహజంగానే ఆడవాళ్లల్లో ఎక్కువ పరిమాణంలో కోర్టిసాల్‌ ఉత్పత్తి అవుతుంది.

కండలు బలంగా ఉండడానికి చేసే వెయిట్‌ ట్రైనింగ్‌ వల్ల కూడా పొట్టలో పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.