ఈ నూనె కొవ్వును కరిగించేస్తుందట..?

09-09-2017: తలకు మాత్రమే ఆరోగ్యాన్నీ, అందాన్నీ ఇచ్చే కొబ్బరినూనె శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది అంటున్నారు పరిశోధకులు. ఇందులో ఉండే మాధ్యమిక ట్రై గ్లిజరాయిడ్‌ ల్యూరిక్‌ ఆసిడ్‌ జీవక్రియ సక్రమంగా జరిగేటట్టు చూస్తుందన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా కొబ్బరినూనెలో ఉండే లాంగ్ చెయిన్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ శరీర భాగాల్లో పేరుకు పోయిన కొవ్వును కరిగించడానికి దోహదపడతాయని వారు చెబుతున్నారు. ఈ ఫ్యాటీ యాసిడ్‌ ఆకలిని నిరోధిస్తుందని అంటున్నారు. వీటి కారణంగా టైపు 2 డయాబెటీస్‌ వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. కొబ్బరినూనెను ఆహారపదార్థాల తయారీలో ఉపయోగించడం వలన పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.