05-03-2018: వేసవిలో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా నిమ్మరసం కాపాడుతుంది. దీన్లోని పీచు ఒంట్లోని కలుషితాలను బయటకు నెట్టేస్తుంది. సబ్జా విత్తనాల్లో పీచుతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే శరీరంలో పేరుకున్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఇప్పుడు తయారీ ఎలాగో తెలుసుకుందాం!
కావలసిన పదార్థాలు
నీళ్లు - ఒకటిన్నర గ్లాసు
తేనె - ఒకటిన్నర టీస్పూను
నిమ్మరసం - 2 స్పూన్లు
సబ్జా విత్తనాలు - 1 టేబుల్ స్పూను
తయారీ విధానం
ఒక టీస్పూను సబ్జా విత్తనాలను నీళ్లలో కలిపి గంటపాటు కదల్చకుండా ఉంచాలి.
దీన్లో మిగతా నీళ్లు, సబ్జా విత్తనాలు, నిమ్మరసం కలిపి బ్లెండర్లో తిప్పాలి.
ఈ డ్రింక్‌ను ప్రతిరోజూ పరగడుపునే తీసుకోవాలి.
ఇలా క్రమం తప్పక చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు.