డైటింగ్‌ చేస్తున్నారా.. కృత్రిమ స్వీట్‌నర్లు వద్దు!

03-08-2017: ఆహార నియంత్రణ(డైటింగ్‌) పాటించే వాళ్లు కృత్రిమ స్వీట్‌నర్లను వాడొద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వాటితో ఒంట్లోకి అధిక కేలరీలు చేరతాయని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తమ పరిశోధనల్లో కృత్రిమ తీపినిచ్చే పదార్థాల వల్ల శరీర బరువు ఎక్కువగా పెరిగినట్లు వెల్లడైందని తెలిపారు. ఈ స్వీట్‌నర్లు జీవక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయని వెల్లడించారు.