సిజేరియన్‌ పిల్లలకు ఊబకాయం ముప్పు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఊబకాయం ఉన్న తల్లులకు సాధారణ ప్రసవం కంటే సిజేరియన్‌ ద్వారా జన్మించే పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువట. ఇలా పుట్టిన పిల్లల్లో మూడేళ్ల వయసులోనే బరువు పెరిగే అవకాశం ఐదు రెట్లు అధికమని తాజా అధ్యయనాల్లో తేలింది. డెలివరీ సమయంలో చిన్నారుల జీర్ణాశయంలో ఉండే లాంకోస్పిరసియో అనే బ్యాక్టీరియా ప్రభావితం కావడం వల్లే ఈ సమస్య వస్తుందని కెనడాలోని ఆల్బెర్టా యూనవర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు.