బరువు తగ్గేందుకు కొత్తమార్గం ‘బాక్స్‌జంప్ వర్క్‌అవుట్’

24-07-2018: ఇలీవలికాలంలో బాక్స్‌జంప్ వర్క్‌అవుట్‌ను చాలమంది సెలబ్రిటీలు ఫాలో చేస్తున్నారు. ఈ వర్క్ అవుట్‌ను వారి ఫిట్ నెస్ షెడ్యూల్‌లో భాగం చేసుకోవడం ద్వారా ఫ్యాట్‌ను తగ్గించుకోవడంతోపాటు కండరాలను బలోపేతం చేసుకోగలుగుతున్నారు. వర్షాకాలంలోఈ వర్క్‌అవుట్ ఎంతో ఉపయుక్తమని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో రన్నింగ్, జాగింగ్, సైకిలింగ్ మొదలైనవి అంతగా చేయడం సాధ్యంకాదు. అందుకే వారు వర్షాకాలంలో బాక్స్ జంప్ వర్క్ అవుట్‌ను సూచిస్తున్నారు. ఇందుకోసం ముందుగా ఒకటి లేదా అడుగున్నర ఎత్తుగల బాక్స్ లేదా, బెంచ్ సిద్ధం చేసుకోవాలి. ఇవి సక్రమంగా బ్యాలెన్స్ చేసేవిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బాక్స్ ఎదురుగుండా నిలుచుని స్కౌట్ పొజీషన్‌లో బాక్స్ పైకి జంప్ చేయాలి. కొన్ని సెకెన్ల పాటు ఆగాక తరిగి వెనుక నుంచి కిందకు జంప్ చేయాలి. ఈ వ్యాయామం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెల్లమెల్లగా జంప్‌లను పెంచుకుంటూ మన స్థాయిని అనుసరించి 12 సార్లు వరకూ చేయవచ్చు. సాథారణంగా అథెలెట్స్ ఈ వ్యయామాన్ని చేస్తుంటారు. కాగా వీడియోలను చూసి ఈ వ్యాయామం చేయడం తగదని, నిపుణులు సమక్షంలోనే చేయడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.