అధిక తీపితో ఆత్రుత, కుంగుబాటు

30-07-2017: మన ముందు ఉన్నాయి కదా.. కోరిక పుట్టింది కదా.. అని తీపి వస్తువులు ఎక్కువగా తింటే ప్రమాదమే అంటున్నారు యూకేలోని యూనివర్సిటీ కాలేజీ లండన్‌ పరిశోధకులు. తీపి పదార్థాలు ఎక్కువగా తింటే పురుషుల్లో ఆత్రుత, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. 1983 నుంచి 2013 వరకు 22ఏళ్ల పాటు 5వేల మంది పురుషులు, 2వేల మంది స్త్రీలను పరీక్షించగా ఎక్కువ మంది పురుషుల్లో మానసిక రుగ్మతలు వచ్చినట్లు తేల్చారు.