కుంగుబాటును తగ్గించే జన్యువు గుర్తింపు

వాషింగ్టన్‌, జూలై 7: కుంగుబాటు.. మనిషిని మానసికంగా నమిలేస్తున్న వ్యాధి. ఈ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 30కోట్ల మంది బాధపడుతున్నారు. చాలా పరిశోధనలు చేసిన తర్వాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు కుంగుబాటు, ఒత్తిడి తదితర మానసిక రుగ్మతలను తగ్గించే జన్యువు ‘ఎస్‌ఎల్‌సీఏ15’ను గుర్తించారు. దీనిసాయంతో కుంగుబాటుకు చికిత్స అందించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ జన్యువును మనుషుల్లోనే కాక జంతువుల్లోనూ గుర్తించామన్నారు.