హృద్రోగుల్లో కుంగుబాటుతో ప్రాణాపాయం

వాషింగ్టన్‌, జూలై 31: ఓవైపు హృద్రోగంతో శారీరకంగా, మరోవైపు కుంగుబాటుతో మానసికంగా బాధపడేవారిలో ప్రాణాపాయ ముప్పు ఎక్కువవుతుందని అమెరికాలోని ఇంటర్‌మౌంటెయిన్‌ మెడికల్‌ సెంటర్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హృద్రోగ వ్యాఽధి తగ్గి ఏళ్లు గడిచినా కుంగుబాటుకు గురైతే కష్టమేనని, మిగతా వ్యాఽ దుల కన్నా అది అతిపెద్ద ప్రమాదకారి అని చెబుతున్నారు. 24,138 మంది రోగుల్ని పరీక్షించి చూడ గా.. ఒత్తిడి, కుంగుబాటుతో బాధపడుతున్న వారిలో ప్రాణాపాయముప్పు ఏర్పడిందని వివరించారు.