ఆవేదనను వ్యక్తపరిస్తేనే ఆరోగ్యం!

14-08-2017: ఎవరిపైనైనా కోపం వస్తే ఏం చేస్తాం. కొందరు ఎదుటి వారు బాధపడతారేమోనని ఆ కోపాన్ని తమలోనే అణిచేసుకుంటారు. మరికొందరు బయటికి వ్యక్తపరుస్తారు. అయితే, తనలోనే కోపాన్ని, ఉద్వేగాన్ని, ఆవేదనను దాచుకునే వారు మానసిక ఒత్తిడికి గురవుతారట. అదే బాధను గానీ, కోపాన్ని గానీ బయటికి కక్కేస్తే ఆరోగ్యంగా ఉంటామని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ బెర్కెలే పరిశోధకులు తెలిపారు. దాదాపు 1,300 మందిని పరీక్షించగా భావోద్వేగాలను దాచుకున్నవారు తీవ్ర ఒత్తిడికి గురై మానసికంగా అనారోగ్యం పాలైనట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని వివరించారు.