హఠ యోగాతో డిప్రెషన్‌ పరార్‌!

05-08-2017: యోగాతో ప్రయోజనాలు ఒక్కోటీ సాధికారికంగా రుజువవుతున్నాయి. మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు యోగా అత్యద్భుతంగా పనిచేస్తోందని అమెరికాలో జరిగిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. డిప్రెషన్‌ లక్షణాలున్న 23 మంది పురుషులు, 52 మంది మహిళలపై వేర్వేరుచోట్ల ఈ పరిశోధనలు సాగాయి. వీరందరితో ధ్యానం, ప్రాణాయామంతోపాటు హఠ యోగాను దాదాపు 8 వారాల పాటు చేయించారు. పాశ్చాత్య దేశాల్లో విక్రమ్‌ యోగా, హీట్‌ యోగా పేరిట హఠ యోగా ప్రాచుర్యంలోకి వస్తోంది. వారానికి రెండు క్లాసుల చొప్పున సాగిన వీరి యోగ సాధన పూర్త్తయ్యాక చూస్తే డిప్రెషన్‌ స్థాయి గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. శాన్‌ఫ్రాన్సిస్కో వైద్య కేంద్రం, మసాచ్యుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలోని పరిశోధక బృందాలు వీరి ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వచ్చాయి