వారి వెన్నంటే ఉండాలి....

13-08-2017: చిన్న పిల్లలు చదువుల ఒత్తిడితో, రకరకాల కుటుంబ సమస్యలతో, ఇతర కారణాలతో తొందరగా డిప్రెషన్‌కు గురవుతుంటారు. అలాగే యువత, పెద్దవాళ్లు కూడా వివిధ సమస్యలతో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. ఇలా డిప్రెషన్‌లోకి వెళ్లిన వారిని సరైన సమయంలో ఆదుకుంటే వాళ్లు తిరిగి సాధారణ స్థితికి రాగలరు. 

అందుకు మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి...

డిప్రెషన్‌లో ఉండేవారి పట్ల అనుక్షణం ప్రేమ చూపాలి.
ఎమోషనల్‌ సపోర్టు అందివ్వడంతోపాటు వారిని అర్థంచేసుకోవాలి.
వారితో ఓర్పుగా ప్రవర్తిస్తూ ప్రోత్సహిస్తుండాలి.
వాళ్ల చేత ఎక్కువగా మాట్లాడించాలి.
వాళ్లు ఏవైనా చె పుతుంటే శ్రద్ధగా వినాలి.
ఒత్తిడిలో ఉన్నవారి భావోద్వేగాల పట్ల, బాధ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు.
ఆత్మహత్య గురించి వీళ్లు మాట్లాడితే తేలిగ్గా తీసుకోవద్దు.
మీ ఫ్యామిలీ థెరపిస్టుకు విషయం వెంటనే తెలియజేయాలి.
ఒత్తిడిలో ఉన్న వారిని ఒంటరిగా వదలకుండా వాకింగ్‌కు, ఔటింగ్స్‌కు, రకరకాల కార్యక్రమాలకు తీసుకెళ్లాలి. వారికి ఇష్టం లేకపోతే మాత్రం బలవంతం చేయొద్దు.
థెరపిస్టు దగ్గరకు వెళ్లేప్పుడు వారి వెంట కుటుంబసభ్యులు ఒకరు తోడుండాలి.
కొంతసమయం పట్టినా కౌన్సెలింగ్‌తో డిప్రెషన్‌ పోతుందని బాధితులకు చెప్పాలి
డిప్రెషన్‌ బాధితులతో పరుషంగా వ్యవహరించకూడదు.
డిప్రెషన్‌ బాధితులు ఎప్పుడూ నవ్వుతుండాలి.
వారిలోని బలాలను, ప్రత్యేకతలను వారికి తెలియజెప్పాలి.
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు మరీ ఎక్కువైతే ఆసుపత్రిలో చేర్పించాలి.