మూత్రపరీక్షతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రాణాపాయం గుర్తింపు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 7: మూత్రంలో వెలువడే అమ్మోనియం స్థాయులతో వివిధ రకాల అనారోగ్యాలను గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులోని యాసిడ్లు మూత్రపిండాల ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ యూటా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి బాధితులలో.. ఈ అమ్మోనియంస్థాయులతో వారి వ్యాధి తీవ్రతను, మరణించే ముప్పును గుర్తిచవచ్చని వివరించారు. రక్తంలో బయోకార్బనేట్‌ స్థాయులను పరీక్షించడంద్వారా శారీరక ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది పూర్తిస్థాయి ఫలితాలను అందించలేదని, అందులోనూ మూత్రపిండాల ఆరోగ్య పరిస్థితిని ఇది సరిగా అంచనా వేయలేదని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ నేపథ్యంలో తాజాగా అభివృద్ధి చేసిన మూత్ర పరీక్ష.. కిడ్నీల ఆరోగ్య పరిస్థితిని వెల్లడించడంతో పాటు ప్రాణాపాయాన్ని గుర్తించి హెచ్చరిస్తుందని అన్నారు.