కిడ్నీ స్టోన్స్‌ నివారణ సులభం

21-06-2017:ప్రస్తుత పరిస్థితుల్లో ‘కిడ్నీ స్టోన్స్‌’ అనేది చాలా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కొందరి కిడ్నీల్లో తరుచూ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. శస్త్రచికిత్స ద్వారా వీటిని తొలగించినా ఇవి మళ్లీ ఏర్పడుతుంటాయి. ఇలా కిడ్నీ పదేపదే తయారయ్యే రాళ్లు కిడ్నీని పూర్తిగా దెబ్బ తీసి, కిడ్నీ పనితనాన్ని పూర్తిగా దెబ్బ తీసే ప్రమాదం ఉంది.

 
కిడ్నీ రాళ్లల్లో రకాలు:
క్యాల్షియం స్టోన్స్‌: వీటిని ఎక్కువగా 20-30 ఏళ్ల వయస్కుల్లో చూడవచ్చు. క్యాల్షియంతో పాటు క్యాల్షియం పాస్పేట్‌, కార్బొనేట్‌ వంటి రకాలు ఇందులో ఉంటాయి.
ఆక్జలేట్‌ స్టోన్స్‌ :వీటిని చాలా మందిలో గమనించవచ్చు. పాలకూర, బీట్‌రూట్‌, బ్లాక్‌-టీ, చాక్‌లెట్టు, గోదుమపొట్టు, నట్స్‌, స్ర్టాబెర్రీ మొదలైన వాటిల్లో ఈ ఆక్జలైట్లు ఎక్కువ.
సిస్టీన్‌ స్టోన్స్‌: ఇవి వంశపారంపర్యంగా ఏర్పడతాయి.
స్ర్టువైట్‌ స్టోన్స్‌: మూత్రకోశాల్లో ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారిలో ఇవి ఎక్కువగా తయారవుతాయి.
యూరిక్‌ యాసిడ్‌ స్టోన్స్‌ : ఇవి పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. గౌట్‌ లేదా కీమోథెరపీ చేయించుకున్న వారిలో ఈ స్టోన్స్‌ ఎక్కువగా తయారవ్వొచ్చు.
కారణాలు : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరికొన్ని ఇతర కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక మోతాదులో ఆక్జలేట్స్‌, కాల్షియం, యూరిక్‌ యాసిడ్‌, సిస్టీన్‌ వంటి కరగని పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కొందరిలో మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌లు, మూత్రమార్గంలో అడ్డంకులు, హైపర్‌ పారా థైరాయిడిజమ్‌, ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పనిచయడం, శరీరంలోని విటమిట్‌ -ఏ శాతం తగ్గిపోవడం వంటి అంశాలన్నీ కిడ్నీలో రాళ్లను ప్రేరేపించే అంశాలు.
 
ముఖ్యంగా ఆహారంలో మాంసకృత్తులు మరియు సోడియం(ఉప్పు) అధిక మోతాదులో తీసుకోవడం, సాధారణం కంటే తక్కువ మోతాదులో (1.5 లీటర్ల కంటే తక్కువ) నీటిని సేవించడం మరియు కొన్ని ఇతరత్రా జబ్బుల వలన ముఖ్యంగా హైపర్‌ కాల్సిమియా, చిన్నపేగు ఆపరేషన్‌లు, రీనల్‌ ట్యాబులార్‌ అసిడోసిస్‌, కొన్ని జన్యుపరమైన అంశాలు, ఆస్ర్పిన్‌, ఆంటాసిడ్స్‌,విటమిన్‌ -సి వంటి కొన్ని మందులు మరియు కాల్షియం సప్లిమెంట్ల వలన కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 
లక్షణాలు : విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి, వాంతులు, మూత్రంలో మంట మొదలైనవి. కిడ్నీస్టోన్స్‌ సమస్యలో కనిపించే ప్రధాన లక్షణాలు. కొందరిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల ఏదో ఓ వైపు నడుమునొప్పి,జ్వరం, మూత్రంలో మంట మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో మాత్రనాళాల్లో కూడా రాళ్లు ఏర్పడటం వల్ల నడుము, ఉదర మధ్య భాగాల్లో నొప్పిఏర్పడి, అది క్రమేణా పొత్తికడుపుకు, కాళ్లలోకి పాకడం జరుగుతుంది. నొప్పితో పాటు, వాంతులు, జ్వరం,మాత్రంలో మంట రక్తం, చీము,కూడా కనిపిస్తుంటాయి. కొందరిలో కండరములు బిగువు,నడుము, ఉదరం మధ్యభాగంలో వాపు, కడుపుబ్బరం, లక్షణాలు గమనించవచ్చు. కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు కనిపించక, నొప్పిలేకుండా కూడా కిడ్నీలో రాళ్లు ఉండొచ్చు. వీటినే ‘సైలెంట్‌ స్టోన్స్‌’ అంటారు.
 
తీసుకోవలసిన జాగ్రత్తలు : ఎక్కువ మోతాదులో నీటిని సేవించడం. అనగా రోజుకు రెండు నుంచి 3 లీటర్ల నీరు తీసుకోవడం. రోజువారీ ఆహారంలో భాగంగా ఉప్పు 5 గ్రాములు, మాంసకృత్తులు 170-230 గ్రాములు మించకుండా చూసుకోవాలి. విటమిన్‌ సి మరియు కాల్షియం సప్లిమెంట్‌లు, మాత్రలు ముఖ్యంగా వైద్యుని సలహా పాటించకుండా యథేచ్ఛగా తీసుకోకూడదు. రోజువారీ ఆహారంలో 1000-1200 మిల్లీగ్రాముల కాల్షియం ఉండేట్లుగా చూసుకోవాలి. శీతలపానీయాలను సేవించడం మానేయాలి.
 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ చికిత్స : హోమియోకేర్‌లో జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ వైద్య పద్ధతిలో కిడ్నీలో రాళ్లను సంపూర్ణంగా తొలగించవచ్చు. వ్యాధి లక్షణాలతో పాటు మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి చికిత్స అందించడం జరుగుతుంది. కొందరిలో వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తరువాత కూడా 50 శాతం వరకు కిడ్నీలో రాళ్లు మళ్లీ ఏర్పడే అవకాశం ఉంది.
 
కానీ ‘హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌’ ట్రీట్‌మెంట్‌ ద్వారా కిడ్నీలలోని లవణాల సమతుల్యతను కాపాడి కిడ్నీల పనితీరును మెరుగుపరచటంతో మళ్లీ ఈ రాళ్లు ఏర్పడకుండా పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ ఇకఈ
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు