లాలాజలంతో కాలేయ వ్యాధుల నిర్ధారణ

21-07-2017: లాలాజలాన్ని పరీక్షించడం ద్వారా కాలేయ వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందుకోసం ఓ కొత్తరకం వ్యాధినిర్ధారణ పరీక్షను అభివృద్ధి చేశారు. దీంతో తక్కువ ఖర్చుతో, సులభంగా కాలేయ వ్యాధులను నిర్ధారించవచ్చన్నారు. ఏటా కాలేయ వ్యాధుల బారిన పడుతున్న 2 కోట్ల మందికి ఈ పరీక్షతో ప్రయోజనం చేకూరుతుందని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు.