కిడ్నీలో రాళ్లకు కచ్చితమైన వైద్యం

ఆంధ్రజ్యోతి, 27/05/15:  కిడ్నీలో రాళ్లు అనగానే చాలామంది పాలకూర, టమోటో తినడం వల్ల ఏర్పడతాయి అనుకోవడం అపోహే. అవి కేవలం ప్రేరేపితాలు మాత్రమే కాని కారణాలు కావు. అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? ఎవరిలో ఏర్పడతాయి?  మొదలైన వాటి గురించి మనం తెలుసుకుందాం.

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణమైన సమస్యగా మారుతుంది. ప్రపంచ జనాభాలో 10 నుండి 15 శాతం ఈ సమస్యతో బాధపడితే మన దేశంలో 5 నుండి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా 20 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో స్త్రీలు కంటే పురుషుల్లో 2 నుండి 3 రెట్లు అధికంగా గమనించవచ్చు. చిన్న పిల్లల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది.
మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఇవి రక్తాన్ని వడబోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటికి పంపించి లవణాల సమతుల్యతను కాపాడుతుంది. ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్పటిక రూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరతాయో అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్ర వ్యవస్థలో భాగం అయిన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశంలో ఎక్కడైనా రాళ్లు ఏర్పడవచ్చు. కాని వాడుక భాషలో వీటన్నింటినీ కిడ్నీలో రాళ్లు అంటుంటాం.
కారణాలు :
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరి కొన్ని కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక మోతాదులో కిడ్నీలు ఆక్జలేట్స్‌, కాల్షియం, యూరికాసిడ్‌, సిస్టీన్‌ వంటి కరగని పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించడం వల్ల రాళ్లు ఏర్పడతాయి. కొందరిలో మూత్రకోశ ఇన్ఫెక్షన్లు, మూత్రమార్గంలో అడ్డంకులు ఏర్పడటం, హైపర్‌పారాథైరాయిడిజం వల్ల రాళ్లు ఏర్పడవచ్చు. ఆహారంలో మాంసకృత్తులు, సోడియం అధిక మోతాదులో తీసుకోవడం, నీరు తక్కువగా తాగడం, ఆస్పిరిన్‌, యాంటాసిడ్స్‌ వంటి మందుల వల్ల, కాల్షియం సప్లిమెంట్ల వల్ల కూడా రాళ్లు ఏర్పడవచ్చు. 
కిడ్నీ రాళ్లలో రకాలు
కాల్షియం స్టోన్స్‌ : కాల్షియంతో పాటు కాల్షియం ఫాస్పేట్‌, కాల్షియం కార్బొనేట్‌ వంటి రకాలు చూడవచ్చు. 20 నుంచి 30 ఏళ్ల వారిలో గమనించవచ్చు.
ఆక్సలేట్‌ స్టోన్స్‌ : ఎక్కువ మందిలో ఈతరహా రాళ్లు ఏర్పడతాయి పాలకూర, బీట్‌రూట్‌, బ్లాక్‌టీ, చాకెట్లు, గోధుమ పొట్టు, నట్స్‌, స్ట్రాబెర్రీ పదార్థాలలో ఆక్సలేట్‌ పుష్కలంగా లభిస్తుంది. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆక్సలేట్‌ స్టోన్స్‌ ఏర్పడే అవకాశం ఉంది. 
సిస్టీన్‌ స్టోన్స్‌ : వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువ. 
యూరికాసిడ్‌ స్టోన్స్‌ : పురుషుల్లో ఎక్కువగా ఏర్పడుతుంటాయి. గౌట్‌ లేక కీమోథెరపీ చేయించుకున్న వారిలో ఈ స్టోన్స్‌ ఎక్కువగా ఏర్పడతాయి. 
లక్షణాలు : 
విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటి లక్షణాలుంటాయి. కొందరిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటం వల్ల నడుం నొప్పి ఒకవైపు రావడం, నొప్పితో పాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలుండవచ్చు. దీన్ని రీనల్‌ కోలిక్‌ అంటారు. మరికొందరిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడతాయి. దీనివల్ల కలిగే నొప్పిని యురిటరిక్‌ కోలిక్‌ అంటారు. నడుం, ఉదరం మధ్యభాగంలో నొప్పి వస్తే ఫ్లాన్స్‌పెయిన్‌ అంటారు. ఇక్కడ నుంచి నొప్పి పొత్తి కడుపుకు, గజ్జలకు, కాళ్లలోకి పాకడం జరుగుతుంది. నొప్పితో పాటు వాంతులు, జ్వరం, మూత్రంలో మంట, మూత్రంలో రక్తం, చీము కూడా కనిపిస్తుంది. మరికొందరిలో కండరాల బిగుతు, ఉదరం మధ్యభాగంలో వాపు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలుంటాయి. కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు, నొప్పి లేకుండా కిడ్నీలోరాళ్లు ఉండవచ్చు. వీటిని సైలెంట్‌ స్టోన్స్‌ అంటారు.
నిర్ధారణ పరీక్షలు : 
రక్తపరీక్షలు, రీనల్‌ ఫంక్షన్‌ టెస్ట్‌, ఎక్స్‌రే కేయూబీ, అలా్ట్రసౌండ్‌, సీటీస్కాన్‌, సిస్టోస్కోపి వంటి పరీక్షలు ఉపయోగపడతాయి. 
హోమియోకేర్‌ చికిత్స:
హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌లో జెనిటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ వైద్య పద్ధతిలో కిడ్నీలో రానం సంపూర్ణంగా నయం చేయవచ్చు. వ్యాధి లక్షణాలతో పాటు మానసిక, శారీరక లక్షణాలు మొదలైనవి పరిగణలోకి తీసుకుని ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం జరుగుతుంది. కొందరిలో శస్త్ర చికిత్స ద్వారా తొలగించిన తర్వాత కూడా 50 శాతం కిడ్నీలో రాళ్లు మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కానీ హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ వైద్యం ద్వారా కిడ్నీలోని లవణాల సమతుల్యతను కాపాడి, కిడ్నీల పనితీరు మెరుగుపరచడంతో మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడకుండా పూర్తిగా నయం చేయవచ్చు.
 
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌ (సీఎండీ)
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.
 ఫోన్‌ : 9550001199/88
టోల్‌ ఫ్రీ : 1800 102 2202